Natyam ad

జగన్‌మోహన్‌రెడ్డితోనే ఆర్టీసి అభివృద్ధి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తోనే ఆర్టీసి అభివృద్ధి జరిగిందని సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ రాజారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని విశ్రాంత ఆర్టీసి ఉద్యోగులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కరపత్రాలు విడుదల చేశారు. రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి , కార్మికులను ఆదుకున్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రి ని చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిధున్‌రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకే వేయాలని సూచించారు.

 

Post Midle

Tags; RTC was developed with Jagan Mohan Reddy

 

Post Midle