రుయా మృతులు 23 మంది

తిరుపతి   ముచ్చట్లు :
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక చనిపోయిన ఘటనలో 23 మంది మరణించారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు అనుగుణంగా మరో 12 మందికి ఎక్స్‌గ్రేషియా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆరుగురికి చెక్కులు పంపిణీ పూర్తయింది. ఈ నెల పదో తేదీనతిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలువురు మరణించారు. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆ రోజే అధికారికంగా ప్రకటించగా… ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని విమర్శించాయి.ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్‌ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి గవర్నర్‌కు లేఖ రాయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 12 మందికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల నిధులను విడుదల చేసింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 23 అని స్పష్టమవుతోంది.దీనిపై రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి స్పందిస్తూ.. ఆ రోజు ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయారని, దాని ప్రభావం వల్ల తర్వాత మరికొందరు మృతిచెందారని తెలిపారు. వారి వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ కోరడంతో మరో 12 మంది వివరాలు అందజేశామని వెల్లడించారు. రుయా అధికారులు ఇచ్చిన నివేదిక అనుసరించి కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఆరుగురికి చెక్కులను పంపిణీ చేశారు.తాజా వ్యవహారంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రుయా ఘటన మృతులు 11 మంది కాదని.. ఆ సంఖ్య ఎక్కువని తాము ముందు నుంచే చెబుతున్నా ప్రభుత్వం అబద్ధాలు చెప్పందని, తాజాగా మరో 12 మందికి పరిహారం ఇవ్వడంతో తాము చెప్పిందే నిజమైందని విపక్ష పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే దుర్ఘటనలో తన భర్త చనిపోయినా పరిహారం జాబితాలో పేరు చేర్చలేదని పీలేరుకు చెందిన లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Rua was 23 dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *