Natyam ad

ధ్యానారామంలో నెల రోజుల పాటు రుద్రాభిషేకాలు

తిరుపతి ముచ్చట్లు:

కార్తీక‌మాసం సంద‌ర్భంగా బుధ‌వారం ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో గ‌ల ధ్యానారామంలో రుద్రాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఉమామ‌హేశ్వ‌ర‌స్వామివారికి, బృహ‌దీశ్వ‌ర స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం ముగిసే వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే రుద్రాభిషేకాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించారు. ల‌ఘున్యాసపూర్వక ఏక‌వార‌ రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి సిఈవో  ష‌ణ్ముఖ కుమార్‌, ఎస్వీ వేద వర్సిటీ రిజిష్ట్రార్ రాధేశ్యామ్‌, డీన్  డా.ఫణియజ్ఞేశ్వర యాజులు, అధ్యాపకులు  నీలకంఠ శర్మ, శ్రీ కార్తికేయన్, విశ్వవిద్యాలయం ఆచార్యులు, వేద‌పండితులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Rudrabhishekas for a month during Dhyanaram

Post Midle