Natyam ad

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన రుద్ర‌యాగం

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీక‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) మంగళవారం ఘనంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.   ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉధ్వాసన‌, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనుంది.నవంబరు 23న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది.  ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags:Rudrayagam concluded at Sri Kapileswara Temple

Post Midle

Leave A Reply

Your email address will not be published.