బద్వేలు పట్టణ అభివృద్ధికి పాలకులు, ప్రభుత్వ అధికారులు కృషి చేయాలి
బద్వేలు ముచ్చట్లు:
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు బద్వేల్ పట్టణంలో కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది ప్రభుత్వం వనరులు ఉన్నాయి, ఇంతవరకు పట్టణాన్ని అభివృద్ధికి నోచుకోక పోవడం పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తాలూకా కన్వీనర్ ఎం.పిచ్చయ్య ,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పి. వెంకటరమణ పేర్కొన్నారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని బద్వేల్ ఆర్డిఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పిచ్చయ్య వెంకటరమణ మాట్లాడుతూ.. బద్వేల్ తాలూకా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బద్వేల్ పట్టణంలో ఇంతవరకు ప్రభుత్వ కాలేజీ లు లేకపోవడం దురదృష్టకరమని, ముఖ్యంగా వయోవృద్ధులు ఉద్యోగస్తులు సేద తీర్చుకొనుటకు పార్కింగ్ సౌకర్యం లేక రోడ్లవెంబడి వాకింగ్ చేస్తూ ప్రమాదాలకు గురి అవుతున్నారని ఈ విషయమై పాలకపక్షం ప్రతిపక్షం పార్కు ఏర్పాటు చేయుటకు కృషి చేయలేదని వారు విమర్శించారు. నాగుల చెరువు, బాకరాపేట చెరువులను సుందరీ కరణంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా చేయాలని, అదేవిధంగా క్రీడాకారులకు స్టేడియం లేక పోవడం బాధాకరం తక్షణమే స్టేడియంలో ఏర్పాటు చేయాలి, బద్వేల్ నియోజకవర్గం లో కళాకారులకు క్షేత్రం ఏర్పాటు చేయాలని, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆర్ డి ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయమై ఆర్డివో గారు స్పందిస్తూ బద్వేలు పట్టణ అభివృద్ధికి ఈ కనీస అవసరాలు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిన్నయ్య, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి బద్వేలు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, దళిత నాయకుడు ఓబయ్య చిన్నప్ప ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Rulers and government officials should work for the development of Badvelu town

