Natyam ad

అంగన్వాడి కార్యకర్తపై దాడికి పాల్పడ్డ అధికార పార్టీ నాయకులు

పలాస ముచ్చట్లు:

 

పలాస మండలం బంటు కొత్తూరు గ్రామంలో నూతనగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంగన్వాడీ కార్యకర్త ఆర్ అప్పలనరసమ్మ (42)పై ఎంపీపీ ప్రతినిధి ఉంగ సాయి, స్థానిక సర్పంచ్ షణ్ముఖలు కలిసి తనపై దాడి చేశారంటూ ఆమె కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాడిని అడ్డుకునేందుకు వచ్చిన తమ కుమారుడుపై కూడా దాడికి పాల్పడ్డారని, గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులకు స్థానిక వైకాపా నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.కాగా మరోవైపు అధికార పార్టీ నాయకులు భాదిత అంగన్వాడి కార్యకర్త పై విధులకు సరిగా హాజరు కావడం లేదని కాశిబుగ్గ పోలీసులకు పిర్యాదు చేశారు.

 

Tags: Ruling party leaders attacked Anganwadi worker

Post Midle
Post Midle