నాపై వదంతులు వస్తున్నాయి

నిర్మల్  ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షరాలు రమాదేవి పార్టీ మారుతున్నారని గత 2 రోజులుగా ఒక ఫోన్ కాల్ రికార్డు వైరల్ గా మారింది .. ఫోన్ సంభాషించిన ఇద్దరు వ్యక్తులు బీజేపీ రమాదేవి తెరాస పార్టీ లో చేరుతున్నారని మాట్లాడడం జరిగింది
బీజేపీ నాయకురాలి వివరణ ఇచ్చారు.  ఇద్దరు వ్యక్తులు కావాలని తన పై ఓర్వలేక  ఫోన్ కాల్ వైరల్ చేస్తున్నారని అదే విధంగా తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకటన విడుదల చేశారు. ముధోల్ నియోజకవర్గంలో కొందరూ కావాలని బీజేపీ పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తాను బీజేపీ పార్టీని విడడం లేదని గత 2014 నుంచి ముధోల్ నియోజకవర్గం నుండి తను ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు కూడా 2వ స్థానంలో ఉండి ఓటమి చెందిన  తాను చేస్తున్న పనులకు గాను పార్టీ తనకు జిల్లా అధ్యక్ష పదవి కట్ట బెట్టారని అన్నారు. బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణ,సిద్దాంతం కలిగిన  పార్టీ అని దీనికి అందరు కట్టు బడి ఉండాలని లేదంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పాటుపడాలని హితవు పలికారు..

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Rumors are coming at me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *