పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధి

-ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్
జగిత్యాల ముచ్చట్లు:
 
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం
జగిత్యాల రూరల్ మండల అంతర్గ,ఒడ్డేర కాలని, కల్లెడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత తోకలసి భూమి పూజ చేశారు.అలాగే సీఎం సహాయనిధి,కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ
చేశారు.ఆనంతరం జగిత్యాల రూరల్ మండలం లోని తక్కలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా తక్కల్లపెళ్ళి గ్రామంలో 15 లక్షల నిధులతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఆనంతరం గ్రామానికి చెందిన 5గురు లబ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల విలువగల చెక్కులను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్ అందజేశారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుందని,ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం వ్యక్తం అవుతుందని అన్నారు.అంతర్గం గ్రామంతో పాటు వంద గ్రామాలను సొంత గ్రామాలుగా భావించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం రాకముందు మన రాష్ట్ర పరిస్థితులు అందరికీ తెలుసు అని,నేడు తెలంగాణ రాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని అన్నారు.
 
 
 
గ్రామంలో తనకు మంచి అనుబందం ఉన్నదని,మొదట పోటీ చేసినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం తరపున అభ్యర్థులు లేరని కానీ నాకు టికెట్ వచ్చిన తర్వాత అనేక మంది నాయకులు వచ్చి చేరి మద్దతు ఇచ్చారని స్వల్ప తేడాతో ఓటమి చెందిన ప్రజల మద్దతు ప్రకారం గా వైద్య వృత్తిని వదిలి పూర్తి సమయం రాజకీయాలకు,ప్రజా సేవకు పార్టీ బలోపేతానికి కృషి చేశానని,అంటర్గం గ్రామ ప్రజలు సొంతంగా ఎన్నికలలో తనకు ప్రచారం చేశారని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా నేడు గ్రామంలో చెరువు నీటితో కళకళ లాడుతున్నాయి అని,వరద కాలువ సజీవంగా ఉన్నదని,నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నీటి సౌలభ్యం ద్వారా రైతుల కళ్ళలో ఆనందం కనబడుతుంది అని అన్నారు.42 కరెంట్ పోల్స్ వేశామని,ప్రతినెలా మూడున్నర లక్షలతో సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ప్రభుత్వం పంచాయతీకి నిధులను అందిస్తుందని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేదని అన్నారు.గ్రామంలో అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేశామని,యాదవులకు గోర్లు,గంగపుత్రులకు చేపలు,రజకులు ఉచిత మీటర్లు ఇలా అన్ని కులాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని,
 
 
సమీకృత మార్కెట్ ఏర్పాటు ద్వారా బీట్ బజార్ చుట్టూ పక్క గ్రామాల రైతులకు ఉపయోగకరం గా ఉంటుందని అన్నారు.పల్లెల అభివృద్ధి కి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని ప్రతి గ్రామంలో తడి పొడి బుట్టల ద్వారా చెత్త సేకరించి కంపోస్ట్ షేడ్ లలో ఎరువుగా మార్చాలని ప్రజలు సహకరించాలని,మరణానంతరం గౌరవపద కార్యక్రమాలకు వైకుంఠ దామాలు,పల్లె ప్రకృతి వనం,ట్రాక్టర్ ట్యాంకర్,ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని,ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని అన్నారు.సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని,కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా నిరుపేద తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసాగా ఇది ఉపయోగ పడుతుందని అన్నారు కల్లేడ లో పెన్షన్ 600 మందికి సంవత్సరానికి కోటిన్నర వస్తున్నాయని అన్నారు.రైతు బందు 10 కోట్లు,75 లక్షలు రైతు భీమా వచ్చిందని అన్నారు. 125 మందికి కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా లబ్ది పొందారని అన్నారు.కల్లెడ నుండి గుత్రాజ్ పల్లి కీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని బ్రిడ్జి నిర్మాణం చేశామని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు.అంగన్వాడి,ఆశా వర్కర్లు జీతాలు పెంచామని,అన్ని ప్రభుత్వ అధికారుల జీతాలు కేంద్ర శాఖ ఉద్యోగుల కంటే ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే నని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సర్పంచ్ జైపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సందీప్ రావు,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,ఉప సర్పంచ్ విక్రమ్,గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మెన్ దశరథ రెడ్డి,మాజీ సర్పంచ్ హన్మాన్ రెడ్డి,మాజీ పీఏసీఎస్ చైర్మెన్ సత్యనారాయణ రావు,రమణ రెడ్డి,మనోహర్ రెడ్డి,గంగారాజం,లింగన్న,సర్పంచులు, నాయకులు
తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Rural development is the lifeblood of the countryside

Leave A Reply

Your email address will not be published.