గ్రామాభివృద్దే ఎమ్మెల్యే ధ్యేయం !

కోసిగి  ముచ్చట్లు :
మేజర్ పంచాయతీ అయిన కోసిగి  గ్రామాన్ని, అన్ని విధాల అభివృద్ధి చేయడానికి  మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగి  రెడ్డి సహకారంతో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని మండల వైయస్ఆర్సిపి ఇన్చార్జ్  మురళీ మోహన్ రెడ్డి అన్నారు.  మంగళవారం  కోసిగి లోని భూ గేనీ  చెరువు  సమీపంలో తాగునీటి సంపు  కోసం  మేజర్ పంచాయతీ సర్పంచ్ సంజిపోగు అయ్యమ్మ   ఆధ్వర్యంలో భూమి పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి మురళి మోహన్  రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే బాల రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.. అలాగే కోసిగి లో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఏడు లక్షల రూపాయలతో సంపు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. సంపులో లక్ష 50 వేల లీటర్లు నీటి ని నిల్వ చేసే సౌకర్యం ఉంటుందన్నారు .దీంతో మేజర్ పంచాయతీ లో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు తోడ్పడుతుందని వారు తెలియజేశారు.ఇందులో వైసీపీ నాయకులు లవకుశ ఈరన్న,మాణిక్య రాజు ,  నాడిగేని నాగరాజు,,పంచాయితీ కార్యదర్శి సత్యాన్నకాంట్రాక్టర్ నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Rural Development MLA Mission!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *