Natyam ad

పల్లె ప్రగతి-5 తో గ్రామాలభివృద్ది

కార్యదర్శులు సరిగ్గా పని చేయకపోతే చర్యలు
అడిషనల్ కలెక్టర్  కుమార్ దీపక్

కమాన్ పూర్ ముచ్చట్లు:

పల్లె ప్రగతి తో గ్రామాలభివృద్ది జరుగుతుందని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కుమార్ దీపక్ అన్నారు. బుధవారం రత్నాపూర్, కల్వచర్ల, పన్నూర్,  గ్రామాలలో ఆయన పర్యటించారు. రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు అధ్వర్యంలో జరుగుతున్న శ్రమదానం పనులను పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ చొరవతో గ్రామాలలో ముందస్తుగా రోడ్లు శుభ్రం, మురికి కాలువలులో చెత్త చెదారం తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లింపు వంటి కార్యక్రమాలు జరుగుతున్నయన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు భాగ స్వాములు కావాలని, ఎవరి ఇంటి వద్ద పరిశుభ్రత ఉంటుందో అక్కడ రోగాలు దరిచేరవు అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పూర్తి చర్యలు చేడుతున్నామన్నారు.
గ్రామ పంచాయితీ కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా రత్నాపూర్ , కల్వచర్ల, పన్నూర్ గ్రామాలలో వివిధ పనులు పరిశీలించారు. ఈయన వెంట ఎంపిపి ఆరెల్లి కొమురయ్య – దేవక్క, సర్పంచులు పల్లె ప్రతిమ పీవీరావు, గంట పద్మ వెంకటరమణ రెడ్డి, అల్లం పద్మ తిరుపతి, ఎంపిటిసి ధర్ముల.రాజ సంపత్, స్పెషల్ ఆఫీసర్,పీడీ ముదం.నాగలైశ్వర్, ఎంపీడీఓ ఇనుముల రమేష్, ఎంపిఓ కాటం భాస్కర్, ఏఈఓ గుడికందుల అరవింద్, ఉపసర్పంచ్ దుబ్బాక సత్య రెడ్డి, వార్డ్ సభ్యులు బొంగురాలగు.రవి,  ఉడుత శంకర్,  కొవ్వూరి సురేష్, పాఠశాల చైర్మన్ నగునూరి శ్రీనివాస్, స్థానిక నాయకులు సందవేనా కుమార్, గడ్డం సదీ, ధర్ముల వెంకటేష్, చందుపట్ల ప్రతాప్ రెడ్డి, మెట్టు రవి, ముడుసు దీక్షిత్, దాసరి మల్లీ, బైన ఓదెలు, నరేష్, సందీప్, కనవేన ముత్యాలు, పీఏ తూము నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Rural development with Palle Pragati-5

Post Midle

Leave A Reply

Your email address will not be published.