నీటిలో మునిగిపోయిన కారును నెట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు నగరంలో తెల్లవారుజాము భారీ వర్షం పడింది. ఈ వర్షానికి మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. గురువారం ఉదయం వివాహాలు ఎక్కువగా ఉండటంతో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. మోకాళ్ళలోతు నీళ్లలో వాహనాలు చిక్కుకుపోయి ముందుకు కదలలేక ఆగిపోయాయి. అదే సమయంలో మాగుంట లేఔట్ బ్రిడ్జి మీదగా తన కార్యాలయానికి వెళ్ళేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడకు చేరుకొని ప్రత్యక్షంగా పరిస్థితిని చూసి కారు దిగి నేరుగా మోకాళ్ళ లోతు నీళ్లలోనే నడుచుకుంటూ కారు వద్దకు వెళ్లారు. వర్షపు నీళ్ళల్లో ఆగిపోయిన కారును ఆయనే స్వయంగా తోయడం ప్రారంభించారు. అలాగే గన్ మెన్ రమేష్, డ్రైవర్ అంకయ్యతో పాటు చుట్టుపక్కల వారు సహాయం చేశారు. బ్రిడ్జి మధ్యలో నుంచి మాగుంట లేఔట్ ఎత్తు ఎక్కే వరకు కారును తోసారు. జోరు వర్షంలో కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తన వంతు బాధ్యతగా మోకాళ్ళలోతు నీళ్లలో ఓవైపు వర్షంలో తడుస్తూనే నెలలో చిక్కుకుపోయిన కారును తోయడం అక్కడున్న వారిని అందరి అభినందనలు అందుకుంది. అక్కడి నుంచి కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ అధికారులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. నీటిని త్వరితగతిన తోడివేయాలని ట్రాఫిక్ కు కానిస్టేబుల్ ను  ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తూ మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో  ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా మోకాల్లోతో నీళ్లల్లో ఆయన చేసిన సహాయం పదిమందికి ఆదర్శంగా నిలిచిపోయింది.

 

Tags: Rural MLA Kotam Reddy pushed the submerged car

Leave A Reply

Your email address will not be published.