31 వ డివిజన్ లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:


ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు – మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా  నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్,రాజ రామిరెడ్డి నగర్ నుండి  నిడారంబరంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 7గంటల నుండి 31వ డివిజన్, రాజా రామిరెడ్డి నగర్  ప్రాంతాలలో “గడప గడపకు – మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా….? అంటూ ప్రతీ ఒక్కరినీ అడుగుతూ… ప్రతి గడపకు తిరుగుతూ ఒకవేళ ఎవరికి అయినా అందకపోతే నా దృష్టికి తెలియజేయండి అవి ఎందువల్ల ఆలస్యం అయినయో వెంటనే తెలియజేయడం జరుగుతుందని  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పై కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమత పొట్లూరు స్రవంతి, 31 వ డివిజన్ కార్పొరేటర్  బత్తల మంజుల,  డివిజన్ అధ్యక్షుడు బత్తల కృష్ణ, స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Rural MLA Kotam Reddy who toured in 31st division

Leave A Reply

Your email address will not be published.