Natyam ad

సోమల మండలంలో ముగిసిన పల్లెబాట కార్యక్రమం

సోమల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం.మొత్తం 4 రోజులు పాటు సొమల మండలం లో 164 పల్లెలు పర్యటించిన మంత్రి .ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో ముగిసిన పల్లెబాట కార్యక్రమం.నియోజకవర్గంలో మొత్తం 13 రోజుల్లో 461 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.బాలప్పగారిపల్లిలో బిసి కమ్యూనిటీ హాల్, పాతూరు లో సచివాలయం, కందూరు లో అర్.ఓ ప్లాంట్, సచివాలయ భవనాలు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Post Midle

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

రాజకీయాల్లో ఎంత మంచి చేసినా, చెడుగా చిత్రీకరించి విమర్శించే వారు చాలా మంది ఉంటారు.చంద్రబాబు మనల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు. మనకు ఎం సంబంధం లేకపోయినా మన పై విమర్శలు చేస్తున్నారు.గత మూడు రోజులు చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నారు.మన ప్రాంతం ఇంత శాంతియుతంగా ఉంటే, మన పై విమర్శలు చేస్తున్నారు.పేదరికం చూసి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనకు అండగా ఉండి, మన నియోజకవర్గ అబివృద్దికి కృషి చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో మనమంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉండాలి.గతంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం.సిఎం  వైఎస్ జగన్ పుంగనూరు ను సొంత నియోజకవర్గం గా భావించి అభివృద్ధి చేస్తున్నారు.40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి ఈ మూడు సంవత్సరాల్లో చేశాం.ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతుంది, ఇకపై త్రాగు, సాగు నీరుకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు

 

 

గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు తనని విమర్శించే పనిలో ఉన్నాడని, రాజకీయాల్లో ఎంత మంచి చేసినా, చెడుగా చిత్రీకరించి విమర్శించే వారు చాలా మంది ఉంటారని ఆరోపించారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం నాడు పుంగనూరు నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారంతో సోమల మండలంలో పల్లెబాట కార్యక్రమం ముగించడం. మొత్తం నాలుగో రోజల పాటు సోమల మండలంలో 164 పల్లెలు పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలీకున్నారు మంత్రి. అనేక సమస్యలను క్షేత్రస్థాయిలో అప్పటికప్పుడే పరిష్కరించారు. శనివారం నాడు కందూరు, వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లి పంచాయతీల పరిధిలోని 38 పల్లెల్లో పర్యటించారు మంత్రి. ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో పల్లెబాటను పూర్తి చేశారు మంత్రి. నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాల్లో 13 రోజుల పాటు 461 పల్లెలు పర్యటించారు మంత్రి.

 

 

 

 

పల్లెబాటలో సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కందూరు లో ప్రసంగించారు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శలు పై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని. ఎం సంబంధం లేకపోయినా తన పేరును కావాలని తీసుకొచ్చి మరి తన పై విమర్శలు చేస్తున్నారన్నారు. గత మూడు రోజులు గా చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పుంగనూరు ప్రాంతంలో అంతా శాంతియుతంగా ఉంటే, ఇక్కడే ఏదో జరుగుతుందని అసత్యాలు ప్రచారం చేస్తూ తన పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత మంచి చేసినా, కావాలని పనికట్టుకుని విమర్శించే వారు ఉంటారని అన్నారు.

 

 

 

 

 

అదేవిధంగా నియోజకవర్గం లో, రాష్ట్రంలో పేదరికం చూసి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉండి, నియోజకవర్గ అబివృద్దికి కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా సిఎం శ్రీ వైఎస్ జగన్ కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమల మండలం లో తాను నాలుగు రోజులు పాటు పల్లెబాట కార్యక్రమం లో పర్యటించారని తెలిపారు. 1978 నుండి తనకు మద్దతు ఇచ్చిన నాయకులు అంతా ఈ ప్రాంతంలో ఉన్నారని అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండడం వల్ల లేదా అధికారం లో ఉండి మనకు మద్దతు లేకపోవడం వలన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయామని అన్నారు. సిఎం   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుంగనూరును సొంత నియోజకవర్గం గా భావించి అభివృద్ధి చేస్తున్నారని, 40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి ఈ మూడు సంవత్సరాల్లో చేశామని వివరించారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుందని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇకపై సోమల, పరిసర ప్రాంతాలకు త్రాగు, సాగు నీరుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని తెలిపారు. ఈ స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుందని, తాను కూడా ఎప్పుడూ ఊహించలేదని వివరించారు.

 

 

 

 

పల్లెబాట లో బాగంగా శనివారం నాడు నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బాలప్పగారిపల్లిలో బిసి కమ్యూనిటీ హాల్, పాతూరు లో సచివాలయం, కందూరు లో అర్.ఓ ప్లాంట్, సచివాలయ భవనాలు ప్రారంభించారు మంత్రి. నాలుగు రోజులు పాటు సాగిన పల్లెబాట లో మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఘన స్వాగతం పలికారు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. మొత్తం నాలుగు రోజుల్లో 8 అర్.ఓ ప్లాంటులు, 4 సచివాలయ భవనాలు, 2 ఆర్బికేలు, 2 వెల్నెస్ సెంటర్లు, 3 అంగన్వాడి భవనాలు ప్రారంభించారు.

   

Tags:Rural program concluded in Somala mandal

Post Midle