గ్రామీణ రహదారులకు మహర్ధశ

Rural Roads

Rural Roads

– రూ.30 కోట్లతో రోడ్ల నిర్మాణాలు
– పెద్దిరెడ్డి

Date:08/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ రహదారులకు మహర్ధశ పట్టిందని, ఇందు కోసం రూ.30 కోట్లు విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని నల్లగుట్లపల్లెలో గ్రామీణ రహదారుల పనుల ప్రారంభించే కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి , మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి హాజరై పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల మరమ్మతులు, నూతన రోడ్ల ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందు కోసం సీసీ రోడ్లకు రూ.29.92 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. దీని ద్వారా మండలంలో 597 పనులు , 74.81 కిలో మీటర్ల మేర రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. అలాగే బీటి రోడ్లకు 48.91 కిలో మీటర్లకు గాను రూ. 5.94 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వీటితో పాటు నూతన మండల కార్యాలయ నిర్మాణానికి రూ.2.64 కోట్లు, నూతనంగా 14 అంగన్‌వాడి కేంద్రాలు నిర్మించేందుకు రూ.1.14 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి ప్రభాకర్‌రెడి, మాజీ వైస్‌ ఎంపీపీ రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సురేంద్రరెడ్డితో పాటు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

నల్లగుట్లపల్లెలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీశిబిరం

Tags: Rural Roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *