Natyam ad

మోదేడులో పోలీస్ అధికారుల పల్లె నిద్ర-చట్టాలకు లోబడి ఉండండి-డిఎస్పి రామ్మోహన్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి

మండలంలోని మోదేడు గ్రామంలో డీఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు పల్లె నిద్ర చేసారు. పలిమెల ఎస్సై అరుణ్ తో కలిసి డీఎస్పి రామ్మోహన్ రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో డీఎస్పి మాట్లాడుతూ గ్రామంలో అనుమానితులకు, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. మావోయిస్టులు వారి కాలం చెల్లిన విధానాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, వారి వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మావోయిస్టులకు సహాయం చేయడం లేదా ఆశ్రయం కల్పించడం చట్ట పరంగా నేరం వారికి శిక్షలు ఉంటాయని తెలిపారు. అదే విధంగా అటవీ భూములను పోడు చేయకుండా అడవిని కాపాడుకోవాలని అన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. చట్టాలను అతిక్రమించేవారు ఎవరైనా శిక్షలు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పి వెంట పలిమెల ఎస్సై అరుణ్ కుమార్ , సివిల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Rural sleeping of police officers in Modedu – obey laws – DSP Rammohan Reddy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.