Natyam ad

సదుంలో రైతు బే రికి అనుమతి లేదు – సబ్ డివిజినల్ పోలీస్ అధికారి సుధాకర్ రెడ్డి

సదుం ముచ్చట్లు:

ఆంధ్రజ్యోతి పేపరు చిత్తూర్ జిల్లా స్పెషల్ నందు వచ్చిన వార్త “28న సదుం లో రైతు బేరి” నిమిత్తంపుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధపడిన సదుం గ్రామం నందు సాధారణంగా ఇరుకైన రోడ్లు, సంధులు అయినందువలన ప్రధాన రహదారి అయిన పుంగనూరు – తిరుపతి రోడ్డుని అన్ని వ్యాపార, వాణిజ్య, రవాణా ఇతర కార్యక్రమాలకు వాడుతారు,
సాధారణంగా ఇక్కడ రోజు ప్రధాన రహదారి, బస్టాండు నాడు పగటి సమయంలో విపరీతమైన రద్దీగా ఉంటుంది. ప్రజా శాంతికి భంగం కలగగూడదని పలమనేరు, సబ్ డివిజినల్ పోలీస్ అధికారి అయిన   N. సుధాకర్ రెడ్డి వారు 30 పోలీస్ ఆక్ట్ జారీ చేయడమైనది. 11-11-2022 నుండి 30-11-2022 వరకు 30 పోలీస్ ఆక్ట్ పలమనేరు, సోమల, సదుం, కుప్పం, వి .కోట, రామకుప్పం, శాంతిపురం మరియు గుడి పల్లె మండలములలో అమలులో ఉంటుంది. ఇటువంటి సమయంలో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపరు నందు వచ్చిన “28న సదుం లో రైతుభేరి” అని వచ్చిన వార్తను అనుసరించి సదుం మండలం మరియు చుట్టుపక్కల మండలాలకు సంబంధించి రైతులకు తెలియజేయడమేమనగా సదుం నందు ఎలాంటి మీటింగులకు గాని, ర్యాలీలకు గాని 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నందున పోలీసు వారు పై రైతు బేరి మీటింగు కు అనుమతి ఇవ్వడం లేదు. కనుక ఈ విషయన్నీ ప్రజలు మరియు రైతులు గమనించి పోలీస్ వారికి సహకరించవలసిందిగా పలమనేరు, సబ్ డివిజినల్ పోలీస్ అధికారి అయిన   N. సుధాకర్ రెడ్డి తెలియజేయడమైనది.

 

Post Midle

Tags: Rythu Bey is not allowed in Sadum – Sub Divisional Police Officer Sudhakar Reddy

Post Midle