ఈనెల 29న జరిగే రైతు కూలీ సంఘం జిల్లా మహాసభను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం ముచ్చట్లు:
అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బహుద, సునాముది, వరహాల గడ్డ వంటి జీవనదులు ఉన్నా శ్రీకాకుళం ఇంకా కరువు పీడిత వెనుకబడిన ప్రాంతంగానే ఉండిపోయింది. ఈ నదుల్లోని వందల టీఎంసీల నీరు ఇప్పటికీ సముద్రంలోకి వృధాగా కలిసిపోతూనే ఉంది. దబార్ సింగ్, కళింగదళ్, నక్కసాయి, జంతిబంధ, సంకు జోడు, దామోదర్ సాగర్, వంటి ప్రాజెక్టులు కడితే ఉద్ధాన ప్రాంతానికి తాగునీరు అందించి కిడ్నీ సమస్యను పూర్తిగా నివారించవచ్చు కాళీగా ఉన్న భూములను మూడు పంటలు పండించవచ్చు, జిల్లాలో ఉన్న ఖనిజ సంపదలను వినియోగించుకోవడం ద్వారా నిరుద్యోగ సమస్య ను రూపుమాపవచ్చు తద్వారా వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు కానీ పాలకులు మిగిలిన ప్రాంతాలకు చౌకగా వలస కూలీలను ఎగుమతి చేయాలని ఈ ప్రాంతాన్ని నిరంతరం కరువు ప్రాంతంగా వెనుకబడిన ప్రాంతంగా మిగులుస్తున్నారు.
మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించట్లేదు ఇటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 29న రైతు కూలీ సంఘం (ఆం. ప్ర) జిల్లా మహాసభ బాపూజీ కళామందిర్ (శ్రీకాకుళంలో) జరుగుతుంది. ఈ మహాసభ సందర్బంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చౌదరి సత్యనారాయణ కాలనీ వద్ద ఉన్న రైతు కూలీ సంఘం ఆఫీస్ లో జిల్లా కార్యదర్శి టి. అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. వర్మ, రైతు కూలీ సంఘం సభ్యులు డి. కృష్ణరావు, ఎస్. లక్ష్మినారాయణ తదితరులు ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి రైతులు వ్యవసాయ కూలీలు గ్రామీణ చేతి వృత్తిదారులు గిరిజనులు ప్రజలు ప్రజాతంత్ర వాదులు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాముని అన్నారు.

Tags: Rythu Kooli Sangam District Mahasabha to be held on 29th of this month should be successful Poster invention
