Natyam ad

స్ఫూర్తి ప్రదాత ఎస్.ఆర్.శంకరన్- కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:


ప్రభుత్వ విధానాల్లో ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన మరో అంబెడ్కర్ గా  పేదల హృదయాల్లో చెరగని ముద్రవేసిన స్ఫూర్తి ప్రదాత ఐ.ఏ.ఎస్. అధికారి ఎస్.ఆర్. శంకరన్ అని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు కొనియాడారు.శనివారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో.. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. దివంగత ఐ.ఏ.ఎస్. అధికారి ఎస్.ఆర్. శంకరన్ 88వ జయంతి సభా కార్యక్రమంజరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు.. జేసీ సాయికాంత్ వర్మ, నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, ఏఎస్పీ తుషార్ డూడీ,డిఆర్వో గంగాధర గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ రోజు ఎస్.ఆర్.శంకరన్  సేవలను ప్రస్తావించే అవకాశం రావడమే తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.తమిళనాడులోని తంజావూరులో 1934 అక్టోబర్ 22న మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. 1956లో ఐఏఎస్ హోదాను అధిరోహించారు. ఐఏఎస్ హోదాలో.. పేదల అభివృద్ధి కోసం.. ప్రభుత్వవిధానాల్లో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అన్నారు. జీవితం మొత్తం అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎస్.ఆర్. శంకరన్ నన్నారు. తనజీవితం అంతా నిజాయితీగా గడిపిన వ్యక్తిగా గుర్తింపు పొందరన్నారు. తనకంటూ సొంత ఇల్లు కూడా లేని నిరాడంబర ఉన్నత అధికారిగా గుర్తింపు పొందారన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు..

 

 

ఐఏఎస్ అధికారులు ఏ స్థాయిలో సేవ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చో ప్రత్యక్షముగా చేసి చూపించిన మహనీయుడని ప్రశంసించారు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమం కొరకుఅహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా.. మరో అంబెడ్కర్ గా సమాజం ఆయనను గౌరవిస్తోందన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ పాలనా విభాగాలేవైనా సరే వారి ప్రధమ కర్తవ్యం అణగారినవర్గాల సమస్యల పరిష్కారమే అని నమ్మి ఆచరించిన వ్యక్తి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పాలనా వ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్ కే దక్కిందన్నారు. జేసీ సాయికాంత్ వర్మమాట్లాడుతూ.. ఎస్.ఆర్.శంకరన్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించిన సందర్భంలో దళిత, ఆదివాసీల సంక్షేమానికి,

 

 

 

Post Midle

అభ్యున్నతికి, అభివృద్ధికి బీటలు వేసే అనేక కీలక మైన నిర్ణయాలు తీసుకు న్నారన్నారు. ఒక్క ఏడాదిలోనే 120 కి పైగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అందులోహరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను సాంఘిక సంక్షేమ శాఖగా మార్పు చేసే జీవో ఒకటి అన్నారు. అయన ఆదివాసులు అభివృద్ధి  సంక్షేమం కోసం ఎంతోగానో కృషి చేసారు. ముఖ్యంగా ఆదివాసీల కొరకుసమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) లను ఏర్పాటు చేయడంలో, గిరిజన ఉప ప్రణాళికలను ప్రవేశ పెట్టడంలో శంకరన్  ముఖ్య పాత్ర పోషించారన్నారు.  నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్మాట్లాడుతూ.. బిళ్ళ బంట్రోత్ లేకపోతే ఆయనను కలెక్టర్ గా గుర్తించడం కూడా కష్టమని.. అంత సాధారణమైన జీవితాన్ని గడిపేవారని.. అందుకే ఆయన పనిచేసే చోట ప్రజలు ఆయనను” ఐఏఎస్ గాంధీ”అని పిలిచేవారన్నారు. పదవీ విరమణ అనంతరం తనకు వచ్చిన పెన్షన్ కూడా పేద ఎస్సి, ఎస్టీ విద్యార్థుల చదువుల కొరకు ఖర్చు పెట్టేవారన్నారు.  డిఎఫ్ఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ..  సామాజికఅభివృద్ధిలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి తన జీవితాన్నే ఫణంగా పెట్టి గాంధేయవాదిగా సేవలందించడం అనే గుర్తింపు ఒక్క శంకరన్ గారికే దక్కుతుందన్నారు. ఉద్యోగ నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనంఅన్నారు. వ్యవస్థాగత రూపకర్త గా ఆయన సేవలు అజరామరం అన్నారు.2004లో ప్రభుత్వంతో మాట్లాడి నక్సలైట్ లను శాంతి చర్చలకు ఆహ్వానింపజేయడంలో ముఖ్య మైన అనుసంధాన కర్తగా..

 

భారత దేశచరిత్ర లోనే ఒక అరుదైన సంఘటనగా చెప్పవచ్చన్నారు. దళిత మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్ తో కలిసి సఫాయి కర్మచారి ఆందోళన్ అనే సంస్థను స్థాపించి పాకీ పనివారి విముక్తికైదేశ వ్యాప్త ఉద్యమం చేసి..  వారి సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించేలాచేశారన్నారు.సామాజికవేత్త జేవి రమణ మాట్లాడుతూ… మానవతా విలువలు మూర్తీభవించిన మహోన్నత అధికారి ఎస్.ఆర్.శంకరన్అన్నారు. కర్మచారీ వ్యవస్థ సంక్షేమానికి కృషి చేసిన అధికారి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆదర్శ మూర్తి అని కొనియాడారు. అంతేకాక పేద బడుగుబలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం.. ప్రభుత్వ విధానాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మరో అంబెడ్కర్ గా ఆయన ప్రతిఒక్కరు హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. భారత ప్రభుత్వంఆయన సేవలను గుర్తించి 2005లో పద్మ భూషణ్ అవార్డును ప్రకటించగా సున్నితంగా తిరస్కరించి.. తన నిరాడంబరతను చాటుకున్న గొప్ప వ్యక్తి అన్నారు. బీసీ సంక్షేమ నాయకులు.. అవ్వారుమల్లికార్జున మాట్లాడుతూ.. “ప్రజల ఐఏఎస్ అధికారి”గా ప్రజల గుండెల్లో మానవతావాదిగా నిలచి పోయిన నిరాడంబరమైన ఐఏఎస్ శంకరన్  జీవితం నేటి తరం  అధికారులకు స్ఫూర్తిదాయకం అన్నారు.నిరుపేదల పాలనే ప్రజా పాలన అని నిరూపించిన మహోన్నత వ్యక్తి అని.. కోట్లాది మంది దళిత ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన అసలు సిసలు ప్రజాసేవకుడు ఐఏఎస్ శంకరన్ గారు అనిప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి జయప్రకాష్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సామాజిక వేత్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: S.R.Sankaran-Collector V.Vijay Ramaraju is the inspiration provider

Post Midle