Natyam ad

భక్తుల తాకిడితో కిటకిటలాడుతోన్న శబరిమల

తిరువనంతపురం ముచ్చట్లు:

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు గురువారం సాయంత్రం తెరిచారు. ఇక రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు.

 

Post Midle

Tags; Sabarimala is crowded with devotees

Post Midle