Natyam ad

శభాష్  వీర నాయక్-అర్ టి సి బస్సులో మంటలు

గుంటూరు ముచ్చట్లు:

సమయానికి సమయస్ఫూర్తి తో వ్యవహరించిన ఈస్ట్ ట్రాఫిక్ సీఐ వీర నాయక్, ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా చర్యలు  తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే గుంటూరు ఆర్టీసీ బస్టాండ్  విజయవాడ సెక్టార్ దగ్గర ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయం లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని ఆర్టీసీ డిపో నుంచి బయటకు వస్తున్న  సమయంలో ఆ బస్సులో ఆకస్మాత్త గా మంటలు వ్యాపించాయి. విధులలో ఉన్న ఈస్ట్ ట్రాఫిక్ సీఐ వీర నాయక్, ఎస్ఐ హరిబాబు. కానిస్టేబుల్ ఆలీ. హోం గార్డ్ ఏసుబాబు వేగంగా స్పందించి స్థానికుల సహాయంతో ఆ బస్సులో మంటలను ఆర్పి వేసి బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ప్రయాణికులను ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. ఈ ఘటనలో  ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరగకుండా కాపాడిన సిఐ వీర నాయక్ మరియు సిబ్బంది ని  ప్రయాణికులు అక్కడే ఉన్న స్థానికులు అభినందించారు.

 

Tags: Sabhash Veera Naik-RTC bus caught fire

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.