సబితా ఇంద్రారెడ్డి తెరాస తీర్ధం పుచ్చుకోవడం పద్ధతి కాదు

Date:14/03/2019
రంగారెడ్డి ముచ్చట్లు:
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాస తీర్ధం పుచ్చుకోవడంపై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.  అన్ని పదవులు అనుభవించి పార్టీ ని వీడడం మంచి పద్ధతి కాదు.  రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.చేవెళ్ల ఎంపీగా  కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి . కాంగ్రెస్ అధికారంలో కి రావడం తోనే కొండ కేంద్ర మంత్రి అవుతారని వారన్నారు.  చేవెళ్ల లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తాం.  కార్యకర్తలు అధైర్య  పడకూడదని అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి. మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.  నాన్ లోకల్ నాయకులను గెలిపించకూడదు.
వికారాబాద్ ను జోగులంబా జోన్ లు కలిపి మన జిల్లాకు నష్టం చేశారు.  111 జీవోను  ఎందుకు రద్దు చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని అయన అన్నారు. పార్టీ నేత కేఎస్ రత్నం మాట్లాడుతూ  పార్టీ మారుతూ పార్టీ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.  పదవులు అనుభవించిన వారు పార్టీ మారడం ఎంత వరకు కరెక్ట్.సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బయపెట్టి ఎమ్మెల్యేలను పార్టీ లో చేరిపించుకుంటున్నారు. కార్యకర్తలను బయపెడితే మేము ఉరుకోమని హెచ్చరించారు.  ఎవ్వరు పోయినా ఏమి కాదు మీరు వెంట్రుక కూడా పీకలేరని అన్నారు.   ఒడిపోతాను అని చెప్పి తెరాస సీనియర్ నాయకుడు ఎంపీ భరీ నుండి తప్పించుకున్నారు.
నాన్ లోకల్ వాళ్ళను గెలిపించం. లోకల్ నాయకుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని గెలిపించాలి.  ఊరు పేరు తెలవని రంజిత్ రెడ్డి ఎలా గెలుస్తారో చూద్దాం. * రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ లను కూడా గెలిపిస్తాము. కార్యకర్తలకు మేము  అండగా ఉంటామని అన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్.మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి చాలా గౌరవం ఇచ్చింది.  ఇంద్రారెడ్డి ఆశయాలు సాధించాలంటే  తెరాస లోకి వెళితే సాధ్యం అవుతాయా. తెరాస  పెట్టినప్పుడు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
Tags:Sabita Indra Reddy is not a method of tanning the teeth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *