సచిన్ రోమాంటిక్  : శ్రీ రెడ్డి

Sachin Romantic: Shri Reddy

Sachin Romantic: Shri Reddy

 Date:11/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటానికి తెరతీసి సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. అందులో భాగంగా టాలీవుడ్ అగ్ర దర్శకులు, నటులపై వేధింపుల ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా కోలీవుడ్ ప్రముఖులను సైతం టచ్ చేసింది. కానీ కోలీవుడ్ మాత్రం శ్రీరెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేయగా కాస్త వెనక్కి తగ్గింది నటి.
తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను సైతం వేధింపుల రొంపిలోకి లాగింది. సచిన్‌పై శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచిన్ క్రికెట్‌ బాగా ఆడటంతో పాటు రొమాన్స్‌ కూడా బాగా చేస్తారని ఫేస్‌బుక్ పోస్టులో శ్రీరెడ్డి కామెంట్ చేశారు. ‘సచిన్ టెండూల్కర్ ఓ రొమాంటిక్ పర్సన్. ఆయన హైదరాబాద్ వచ్చిన సమయంలో అందమైన అమ్మాయిలతో గడుపుతాడు.
సచిన్‌కు చార్మింగ్ ఉన్న యువతులను సరఫరా చేయడంలో ప్రముఖ వ్యక్తి చాముండేశ్వరి స్వామి మధ్యవర్తిత్వం చేస్తాడు. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు.. అదే రొమాన్స్ బాగా చేస్తారంటూ’ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రపంచ మొత్తానికి తెలియని విషయాలు మీకు మాత్రమే తెలుస్తాయని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. చాముండేశ్వరి స్వామి బ్రోకర్ అన్న విషయం అందరికీ తెలుసునంటూ మరొ నెటిజన్ స్పందించాడు.
Tags:Sachin Romantic: Shri Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *