బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Sacred Celebrations at Sri Venkateswaraswamy Temple in Bengaluru

Sacred Celebrations at Sri Venkateswaraswamy Temple in Bengaluru

Date:21/09/2019

తిరుమల ముచ్చట్లు:

టిటిడి పరిధిలోని బెంగళూరులో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 25 నుండి 27వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 24న సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.ఇందులో భాగంగా సెప్టెంబ‌రు 25న యాగశాలలో వాస్తుహోమం, రక్షాబంధనం, రాత్రి పవిత్రప్రతిష్ఠ నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 26న ఉదయం స్నపనతిరుమంజనం ఆ తరువాత పవిత్ర సమర్పణ చేపడతారు. సెప్టెంబ‌రు 27న ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం ఊంజ‌ల్‌సేవ‌, రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరియం, ఒక రవికె, ఒక లడ్డూ, వడ, ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా సెప్టెంబ‌రు 27న‌ అభిషేకం ఆర్జిత‌ సేవను టిటిడి రద్దు చేసింది.

టిటిడి నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం

Tags: Sacred Celebrations at Sri Venkateswaraswamy Temple in Bengaluru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *