తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న
పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శాస్త్రోక్తంగా
పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు.ఆతరువాత పవిత్ర
సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో రమేష్, అర్చకులు బాబుస్వామి, మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags: Sacred offering at Sripadmavati Ammavari temple in Tiruchanur

