Sacrifice ceremonies ending with Poornahuti at Srivari Temple

శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Date:01/08/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శ‌నివారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా శ‌నివారం ఉదయం 7.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.  కాగా, సాయంత్రం 3.00 నుండి 4.00 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు రంగ‌నాయుకుల మండ‌పంలో వేంచేపు చేశారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా బక్రీద్ వేడుకలు

Tags:Sacrifice ceremonies ending with Poornahuti at Srivari Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *