విద్యార్థులని కరోనాకి బలి చేస్తారా.?

-ఎన్ ఎస్ యూ ఐ  జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్
ఎమ్మిగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలో రాష్ర్టంలో రోజు రోజుకు కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్న  తరుణంలో పాఠశాలలు కొనసాగించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చేలాగాటమాడటమేని  ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.కరోనా స్వైర విహారం చేస్తున్నదని రేపటి తరాన్ని కాపాడుకోవడం రాష్ర్టా ప్రభుత్వాల బాధ్యత అని పక్క రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే, ఈ రాష్ర్టం లో ఉన్న జగన్ మోహన్  రెడ్డి ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో  విద్యార్థుల  ప్రాణాలని పనంగా పెట్టె  పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేయకుండా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి,ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యా సంస్థల సిబ్బంది కి కరోనా వ్యాక్సిన్ పూర్తి చేసిన తర్వాత విద్యా సంస్థలను ప్రారంభించాలనన్నారు. లేని పక్షంలో ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Sacrifice students to Corona.?

Natyam ad