Natyam ad

పోలీసుల త్యాగాలు గొప్పవి-మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ ముచ్చట్లు:


వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోలీస్ అమర వీరులకు నివాళులర్పించారు. పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. కొందరు పోలీస్ అమర వీరులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు నివాళులు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్నది పోలీస్ లే. పోలీస్ వృత్తి అనేక వత్తిడిలతో కూడుకున్నది. పోలీస్ లు తమ వృత్తి ధర్మం కోసం, కుటుంబాల ను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారు. పోలీస్ లు కొందరు కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి అలాంటి వారి త్యాగాలు గొప్పవి. వారి కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి. నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాను. విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి తరుణ్ జోషి వివిధ స్థాయిల పోలీసు అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Sacrifices of the police are great- Minister Errabelli

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.