ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రత్యేక వీడియో సందేశం విడుదల

Date:24/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ, ” ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూ ట్యూబ్ లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం” అని ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు.ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్ లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని…మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ గారు తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం అన్నారు.  హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

డిమాండ్ లేకుండా  బంతిపూలు

Tags: Saddula Bathukamma festival wishes to all the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *