పంట పొలాలు కి సాగర్ నీళ్లు ఇవ్వాలి

Date:18/09/2020

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా  దర్శి లో  శుక్రవారం   టీడీపీ జిల్లా లేగెల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ ఆధ్వర్యంలో దర్శి  ఎన్ ఎస్ పి డిప్యూటీ ఇంజినీర్ ను కలిసి   పంట పొలాలు కి సాగర్ నీళ్లు ఇవ్వాలి అని  కోరుతూ వినతిపత్రాన్ని అంద చేశారు.ఈ సందర్బంగా మాట్లాడు తూ  నెలన్నర నుండి సాగర్ నిండి కాల్వలు గుండా సముద్రానికి నీళ్లు పోతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండ చోద్యం చూస్తుంది అన్నారు.  జిల్లాలోని 8 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు కు నింపి, అలాగే 226 చెరువులు  నింపి పంట కాలవ లకి నీళ్లు ఇస్తే బాగుంటుందని అని, అలా కాకుండా ప్రభుత్వానికి ప్రణాళికలు లేకుండా నీళ్లు అన్ని సముద్రపు పాలు చేసారు అని పరిటాల సురేష్ అన్నారు.ఇప్పటి కి అయిన ప్రణాళికా ప్రకారం  వెంటనే ప్రభుత్వం ప్రకటన చేసి పంట లకు  నారులు పొసే విదంగా చేయాలి  అని  హితవుపలికారు. ఈ కార్యక్రమంలో దర్శి మండలం టీడీపీ  మాజీ ప్రధానకార్యదర్శి రాచపుడి మోషే, పవని కిరణ్, వెంకటేష్, ఖాసీం, యోహాను, మరియు  రైతులు పాల్గొన్నారు.

టూరిజం తరహాలో అభివ్యృధ్దే ధ్యేయం- మంత్రి పెద్దిరెడ్డి ఆశయం

Tags: Sagar water should be given to crop fields

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *