మానవజాతికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి మహర్షి
వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించిన టిడిపి నేతలు
ఎమ్మిగనూరు ముచ్చట్లు:

టిడిపి నేతలు ఎమ్మిగనూరు పట్టణంలో… ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నేతలు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ… రామాయణాన్ని మధుర కావ్యంగా మలచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడని కొనియాడారు. వయోజన విద్యతో దేనినైనా సాధించవచ్చు అని చాటి చెప్పిన గొప్ప దార్శనికుడు వాల్మీకి మహర్షి అని పేర్కొన్నారు. వాల్మీకుల కోరిక మేరకు నియోజకవర్గ కేంద్రంలో.. వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు సంకల్పించి సహకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వాల్మీకులకు సంక్షేమ భవనం లేకపోవడం విచారకరమన్నారు. జగన్ సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని గాలికి వదిలేస్తున్నారని ఆవేదన చెందారు. వాల్మీకులకు రాజకీయంగా ,సామాజికంగా , ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో… టిడిపి నేతలు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆం.ప్ర. రాష్ట్ర సగర (ఉప్పర)ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, నందవరం మండలం టిడిపి నాయకులు ముగతి వీరారెడ్డి, ఎమ్మిగనూరు మండలం టిడిపి నాయకులు కె. తిమ్మాపురం బోయ కురుమన్న, బోయ చిన్న హనుమంతు, కురువ వీరేష్, మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, గుడికల్ కోలంట్ల బోయ నాగరాజు, బోయ నడువులయ్య, పట్టణ టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె. యం.డి. అబ్దుల్ జబ్బర్, ఆఫ్గాన్ వలిభాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, దర్జీ మోషన్న, యస్. సాల్మన్, వివిధ సంఘాల వాల్మీకి నేతలు, వాల్మీకి విగ్రహ నిర్మాణ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Sage Valmiki was the great one who showed the right path to mankind
