సింహగిరిలో ధనుర్మాస ఉత్సవాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస ఉత్సవములను పురస్కరించుకుని 22వ రోజు అమ్మవారి తిరువీధి సేవ చేయటం జరిగినది. ఆండాళ్ అమ్మవారి సన్నిధియందు 22వ పాశుర విన్నపం చేసినారు.శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశేషమైన పగల్ పత్తు ఉత్సవములలో భాగంగా 4వ రోజు స్వామి వారి తిరువీధి సేవ వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధ పారాయణల నడుమ నాదస్వర మేళ తాళాలతో శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం అత్యంత వైభవంగా స్వామి వారి సన్నిధియందు జరిగినది.అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామి వారిని ఆస్థాన మంటపములో వేంచేపు చేసి నాళాయిర దివ్యప్రబంధ పారాయణం చేసినారు.అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో వేంచేపు చేయడంతో 4వ రోజు కార్యక్రమం సర్వజన మనోరంజకముగా ముగిసినది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sagittarius festivals in Sinhagiri