సాక్షి ఎక్ష్కెలెన్సీ అవార్డు గ్రహీత సహదేవయ్యకు ఘన సన్మానం
నెల్లూరు ముచ్చట్లు :
గవర్నర్ విశ్వ భూషణ్ చేతులమీదుగా సాక్షి ఎక్ష్కెల్లెన్సీ అవార్డును అందుకున్న సహదేవయ్యకి ఘన సన్మానం కార్యక్రమం జరిగింది. నెల్లూరు గ్రామీణ మండల పరిధిలోని పొదలకూరు రోడ్డు, పిండిమిల్లు సెంటర్ వద్ద ఉన్న నవజీవన్ ఆర్గనైజేషన్ కార్యాలయం నందు నవజీవన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కాలువపల్లి సహదేవయ్యకి సాక్షి ఎక్సలెన్సీ అవార్డును గవర్నర్ విశ్వభూషన్ చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పి.ఎం.పి అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజే, ఫోటోగ్రఫీ అసోసియేషన్, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగినది. ఈకార్యక్రమములో జీవో ఎన్జీవో నోడల్ అధికారి ఏ.మహేంద్ర రెడ్డి, పీఎంపీ గౌరవఅధ్యక్షులు అనుమల జయప్రకాష్ , రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, పీఎంపీ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, డివిజన్ అధ్యక్షులు గోరంట్ల శేషయ్య, ఫోటోగ్రఫీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్, చైల్డ్ షెఫర్డ్ సంస్థ అధ్యక్షురాలు నూర్జహాన్ బేగం గారు, టీచర్ సుబహాన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల సుబ్బారావు , శ్రీమన్నారాయణ రాజేష్, మన్సూర్, బిందు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Sahadevaiah, recipient of the Sakshi Excellence Award, is honored

