Saho Collections Adharaho

Saho Collections Adharaho

Date:31/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

సాహో’ సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘సాహో’ తొలిరోజు రూ.35.2 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలిసింది. ముంబై బాక్సాఫీస్ వద్ద కూడా రూ.24 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టినట్లు సమాచారం. మలయాళ వెర్షన్‌కు సంబంధించి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి.

 

 

 

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ‘సాహో’ వసూళ్ల వివరాలు (షేర్)
నైజాం – రూ. 9.4 కోట్లు
సీడెడ్ – రూ. 4.6 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.8 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 4.4 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 3.6 కోట్లు
కృష్ణా – రూ. 2.5 కోట్లు
గుంటూరు – రూ. 4.7 కోట్లు
నెల్లూరు – రూ. 2.2 కోట్లు
మొత్తం షేర్ – రూ.35.2 కోట్లు

 

 

 

ఇదిలా ఉంటే, ‘సాహో’పై నెగిటివ్ ప్రచారం జరిగితే మాత్రం రెండు వారాలు కూడా సినిమా థియేటర్‌లో నిలవదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే దగ్గర బెడిసికొట్టిందని చాలా మంది అన్నారు. ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో ‘సాహో’కు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది.

 

 

 

 

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని వాయిదా వేశారు. సాహో విడుదలకు ముందు మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ ప్రభావం సాహో మీదే పడే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

Tags: Saho Collections Adharaho

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *