Date:14/12/2019
తిరుమల ముచ్చట్లు:
సినీ హీరో సాయి ధరమ్ తేజ్ శనివారం ఉదయం స్వామివారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఈయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు..దర్శనం అనంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేద శీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదలను అందచేశారు. ఆలయం వెలుపల మిడియాతో మాట్లాడారు సాయిధరమ్ తేజ్. తన ప్రతి సినిమా విడుదలకు ముందుగా స్వామి వారిని ఆశీస్సులు కోసం తిరుమలకు రావడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా తను నటించిన “ప్రతి రోజు పండుగ రోజు” సినీమా మంచి విజయం సాందించాలని స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు. నూతన దర్శకుడితో ఎస్వీసిసి కార్పొరేషన్ ఒంగోలు ప్రసాద్ నిర్మిస్తున్న “సోలో బ్రతుకే సోబెటర్” చిత్రంలో నటిస్తున్నట్లు సాయి ధరమ్ మీడియాకు వివరించారు.
మెల్బోర్న్ లో కొమటిరెడ్డి నిరసన
Tags:Sai Dharam Teja visited Venkanna