సాయి పల్లవి వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

లేనిపక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సినిమాలు అడ్డుకుంటాం.
యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మెన్ కె.శివకుమార్ హెచ్చరిక…

హైదరాబాద్ ముచ్చట్లు:


గో మాత, గో రక్షకుల పై హీరోయిన్ సాయి పల్లవి చేసిన వాఖ్యలను యుగ తులసి ఫౌండేషన్ ఖండించింది. సాయి పల్లవి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మెన్ కె.శివకుమార్ హెచ్చరించారు.
ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ కావడానికి ఈ తరహా వాఖ్యలు చేయడం సమంజసం కాదు. ప్రాణాలు పణంగా పెట్టి..హిందువుల దైవం అయిన.. గో మాత ను రక్షించుకుంటున్నాం. పూర్తి అవగాహన లేకుండా సాయి పల్లవి మాట్లాడుతుంది. బేషరతుగా సాయిపల్లవి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో సాయి పల్లవి సినిమాలు అడ్డుకుంటాం. సాయిపల్లవి వల్ల ప్రొడ్యూసర్లు నష్టపోతారు. బక్రీద్ సందర్భంగా.. గో హత్యలు అడ్డుకోవాలి. ఒవైసీ ఆదేశాలుతో ప్రభుత్వం పనిచేయకూడదని అన్నారు.
ఒవైసీ దారుసలాం ఆదేశాలను, ప్రభుత్వ,పోలీసులు అనుగుణంగా పనిచేస్తే ఖబర్దార్. ఈ విషయంలో పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో పనిచేయరని ఆశిస్తున్నాం. గో మాత రక్షణ కోసం హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఒక్క గోవు బలికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పై ఉందని శివ కుమార్ అన్నారు.

 

Post Midle

Tags:Sai Pallavi remarks should be withdrawn

Post Midle
Natyam ad