సైనా టోర్ని నుంచి ఔట్

Saina out of the tournament

Saina out of the tournament

Date:18/09/2018
బీజింగ్ ముచ్చట్లు :
చైనా ఓపెన్‌లో పీవీ సింధు ప్రి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగా.. సైనా నెహ్వాల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2016లో చైనా ఓపెన్ టైటిల్ గెలిచిన మూడో సీడ్ సింధు.. జపాన్‌కు చెందిన సయేనా కవకమి‌ని 21-15, 21-13 తేడాతో తొలి రౌండ్లో ఓడించింది. వరుస గేముల్లో గెలుపొందిన సింధు తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఓటమిపాలై నిరాశపర్చింది.
కొరియాకు చెందిన సంగ్ జి హ్యూన్ చేతుల్లో 22-20, 8-21, 14-21 తేడాతో పరాజయం పాలైంది. 2014లో చైనా ఓపెన్ గెలిచిన సైనా.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డ్ నెలకొల్పింది. పురుషుల డబుల్స్‌లో నేషనల్ ఛాంపియన్స్‌గా నిలిచిన మను అట్టారీ, బి.సుమీత్ రెడ్డి ద్వయం.. చైనీస్ తైపీకి చెందిన లియావో మిన్ చున్, సు చింగ్ హెంగ్‌పై 13-21, 21-13, 21-12 తేడాతో విజయం సాధించింది.
Tags:Saina out of the tournament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *