పూలేకు సజ్జల నివాళులు
కర్నూలు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలోని బిర్లా గేట్ వద్ద వున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మాజీ ఎంపీ బుట్టా రేణుకా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags; Sajjala tributes to Poole

