జాతీయ గీతానికి సలామ్‌

Salam for the National Song

– వైభవంగా వంద రోజుల పండు

Date:23/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

నిత్యజాతీయగీతాలాపన వంద రోజుల పండుగ సందర్భంగా పట్టణ ప్రజలు జాతీయ గీతానికి ఇందిరాసర్కిల్‌లో వందన సమర్పణ చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు చిరుజల్లుల మధ్య జనగణమన కమిటి సభ్యులు ప్రకాష్‌, అయూబ్‌ఖాన్‌, దీపక్‌, శ్యామ్‌ప్రసాద్‌, ముత్యాలు కలసి వంద రోజుల పండుగను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర , కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ నాగశేఖర్‌ , ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి , లయన్స్క్లబ్‌ జిల్లాపీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, డాక్టర్‌ కె. సరళ, జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జెడ్పిప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌లు హాజరైయ్యారు. పూలే విగ్రహానికి , తెలుగుతల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 7:59 గంటలకు పోలీస్‌ సైరన్‌తో ప్రారంభమైన గీతాలాపనకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ పట్టణంలో ఆగస్టు 15న ప్రారంభమైన జనగణమన గీతాలాపన ప్రతి రోజు క్రమం తప్పకుండ వంద రోజుల పండుగ నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ పుంగనూరుకు దేశ వ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని పిలుపునిచ్చారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగశేఖర్‌ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడుకున్న ఇలాంటి కార్యక్రమాలు ద్వారా దేశభక్తి పెరుగ డంతో పాటు మత సామరస్యం మరింతగా బలపడుతుందన్నారు. దీని ద్వారా ప్రజలకు క్రమశిక్షణ అలవడి , సమాజంలో నేరాలు తగ్గుముఖం పడుతుందని తెలిపారు. ఇలాంటి మహాత్తర కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ దేశభక్తి తగ్గుతున్న తరుణంలో పుంగనూరులో నిత్యజాతీయగీతాలాపన ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో ప్రతి రోజు పాల్గొని, విజయవంతం చేయాలని, గీతాలాపన చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. వైఎస్‌ఆర్‌సిపి జెడ్పిప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ నిత్యజాతీయ గీతాలాపనతో పుంగ నూరు దేశస్థాయి రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. పుంగనూరు పట్టణ ప్రజలుగా ఇలాంటి మహాత్తర కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ ఆర్టీసి మజ్ధూర్‌ జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహిం, ఆసిఫ్‌, దివ్యలక్ష్మి, రేష్మా, పుంగనూరు డెవలెప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తల్లడిల్లుతున్న ఉల్లి రైతు

Tags: Salam for the National Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *