Salam to the workers in the corona building

కరోనాకట్టడిలో కార్మికులకు  సలాం

– ఎంపీ  రెడ్డెప్ప

Date:03/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటీ పరిధిలో కరోనా నియంత్రణలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు అమోఘం అని, వారికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం కమిషనర్   కె.ఎల్ వర్మ ఆధ్వర్యంలో రెడ్డెప్ప అనే కార్మికుడు పదవీ విరమణ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప హాజరై కార్మికుడికి పూలమాలవేసి సత్కరించారు .ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అతనికి అందజేయనున్న ఆర్థిక సహాయం అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ మున్సిపాలిటీలో అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న కార్మికుల రుణం తీర్చుకోలేము అని కొనియాడారు. అలాగే  సేమో సమస్త  నిర్వాహకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్మికులు ఓ ఆర్ ఎస్, సి విటమిన్ ప్యాకెట్లు ఎంపీ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ,శివ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్ మనోహర్ , శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు,  సప్దర్ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్లు ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాలి

Tags:Salam to the workers in the corona building

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *