హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

మరణించిన, సస్పెండైన, పెన్షనర్లకు సైతం పూర్తి స్థాయిలో జీతాలు
 
అమరావతి  ముచ్చట్లు:
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో మొదటిసారిగా నెల తొలి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడిన విషయం తెలిసిందే. హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
వేసి ఏపీ సర్కార్ నాలుక కరుచుకుంది. ‘తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న రీతిలో జీతాలు ఉద్యోగుల అకౌంట్‌లలో పడేసింది.అయితే.. ట్రెజరీ ఉద్యోగులతో సంబంధం లేకుండా ఈ జీతాలు
వేసి తప్పులో కాలేసింది. మరణించిన, సస్పెండైన, పెన్షనర్లకు సైతం పూర్తి స్థాయిలో జీతాలు వేసింది. ఆనక లెక్కలు సరి చూసుకుని తెల్ల మొహం వేసింది. లెక్కల్లో భారీగా తేడా వచ్చేసింది. దీంతో
ఆఘమేఘాల మీద ట్రెజరీ ఉన్నతాధికారులకు మరణించిన, సస్పెండ్ అయిన, పెన్షనర్ల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు
ప్రొఫార్మా పంపారు. అనర్హులకు జీతాలు పడ్డాయని ప్రభుత్వానికి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందాయి. దీంతో అనర్హులకు జీతాలు పడితే వారి వివరాలు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
 
Tags; Salaries for government employees in a hurry

Leave A Reply

Your email address will not be published.