Salaries should not be given either..Rajadani Marustarata: MP Raghurama

జీతాలు కూడా ఇవ్వలేనోళ్ళు..రాజదాని మారుస్తారట: ఎంపీ రఘురామ

Date:07/08/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

అధికార పార్టీ విధానాలను నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటిది ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదని హితవు పలికారు. అయినా ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదన్నారు. ఇక రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారన్నారు. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. రాజధాని వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

 

 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ పై మరో మూడు కేసులు.. – జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే.. – సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం

Tags:Salaries should not be given either..Rajadani Marustarata: MP Raghurama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *