స్కూల్ కు రాకుండానే ఐదు నెలల నుంచి జీతం

 స్కూల్ కు రాకుండానే ఐదు నెలల నుంచి జీతం
మెదక్ ముచ్చట్లు:

మెదక్ జిల్లాలో పాఠశాలకు రాకుండా, పిల్లలకు పాఠాలు చెప్పకుండానే జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయుడి భాగోతం వెలుగు చూసింది. ఐదు నెలలుగా పాఠశాలకు రాకుండా మేనేజ్ చేస్తుంటే, విద్యా శాఖ అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది.జిల్లాలోని మనోహరాబాద్ మండలంలోని పలాట గ్రామంలో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలో తెలుగు బాషా పండితునిగా పనిచేస్తున్న వెంకట కృష్ణ రెడ్డి, గత ఆగష్టు 7న చిన్న శంకరంపేట్ మండలంలోని గజగట్ల పల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు డెప్యూటేషన్‌పై వచ్చాడు.వందమంది విద్యార్థులున్న పాఠశాలలో, అప్పటికే మొత్తం నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు ప్రణిద్‌తో పాటు లతా, కవితలు పనిచేస్తుండగా డెప్యూటేషన్ పైన వచ్చిన మరొక ఉపాద్యాయుడు రాజేశ్వర్ రెడ్డి కూడా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు సరిపోను ఉపాధ్యాయులు ఉన్నా.. మరొక ఉపాద్యాయుడు ఇక్కడికి డెప్యూటేషన్‌పై రావటం గమనార్హం.నిబంధనల ప్రకారం, ఉపాధ్యాయుల డెప్యూటేషన్లు ఒక మండల పరిధిలోనే జరగాలి. బాషా పండితునిగా పనిచేస్తున్న ఉపాధ్యాయుని డెప్యూటేషన్‌పై ప్రాధమిక పాఠశాలకు పంపకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వెంకట కృష్ణ రెడ్డి అనే ఉపాధ్యాయుడు, తనకున్న రాజకీయ పలుకుబడితో మనోహరాబాద్ మండలం దాటి, చిన్న శంకరంపేట్ మండలంలో ఉన్న గజగట్ల పల్లి ప్రాధమిక పాఠశాలకు డెప్యూటేషన్ తెచ్చుకున్నాడు.ఐదు నెలల సమయంలో ఎప్పుడు స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా జీతం మాత్రం ప్రతినెలా క్రమం తప్పకుండా తీసుకుంటున్నాడు.
గజగట్లపల్లి ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రణిద్ , ప్రతినెలా వెంకట కృష్ణ రెడ్డి స్కూల్ హాజరు అవుతున్నట్టు హాజరు రిజిస్టర్ ను పలాట స్కూల్ కు పంపుతున్నాడు.వెంకటకృష్ణ రెడ్డి, ప్రతి నెల పలాట పాఠశాలకు వెళ్లి తన జీతం తెచ్చు కుంటున్నాడు. ఐదు నెలలుగా ఈ తతంగం నడుస్తున్నా, విద్యార్థులకు కానీ, గ్రామస్థులకు కానీ తమ పాఠశాల్లో ఐదో ఉపాద్యాయుడు ఉన్నట్టు తెలియదు. గత రెండురోజులుగా, ఉపాధ్యాయ సంఘాల ద్వారా విషయం తెలియటంతో. కొంతమంది జిల్లా విద్యాధికారి రాధాకిషన్ కు పిర్యాదు చేశారు.ఐదు నెలలుగా ఈ తతంగం అంతా నడుస్తున్నా, మండల్ విద్యాధికారి ఏమి చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంకట కృష్ణ రెడ్డి పాఠశాలకు హాజరు కాకున్నా, ప్రధానోపాధ్యాయుడు ఎందుకు తనకు హాజరు వేసి సహకరిస్తున్నాడని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తగిన విచారణ చేసి, బాధ్యులైన అందరిపై, కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Tags: Salary from five months without coming to school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *