ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు వేతనాలు మంజూరు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు గత జూన్‌ నుంచి ఆగస్టు వరకు చెల్లించాల్సిన వేతనాలు మంజూరయ్యాయి. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ గురువారం ఆర్థికశాఖ ఆమోదంతో రూ.57 కోట్ల వేతన బడ్జెట్‌ను విడుదల చేశారు. గత మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న అధ్యాపకులు కనీసం దసరా నాటికైనా మంజూరవుతాయా.. లేదా.. అని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జీతాలు విడుదలవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Salary sanction to contract faculty working in government degree colleges

Leave A Reply

Your email address will not be published.