విద్యార్దులకు డ్రగ్స్ విక్రయాలు
చంద్రగిరి ముచ్చట్లు :
తిరుపతి జిల్లా చంద్రగిరిలో విద్యార్థులకు కొందరు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సిగరేట్ల రూపంలొ డ్రగ్స్ అమ్ముతున్నారని ఆమె తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లితండ్రులు ఆమెను వెదకడం ప్రారంభించారు. గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉన్న టీ దుకాణంలో డ్రగ్స్ ఇచ్చినట్లు తల్లితండ్రులు ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థిని తల్లిదండ్రుల పై దాడికి యత్నం జరిగింది. టీ దుకాణంలో పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు బాధితులు సమాచారం ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న పోలీసులు పట్టించుకోవడంలేదని వారు అంటున్నారు.
Tags: Sale of drugs to students

