మెప్మా బజారులో ప్రజలకు అవసరమైన వస్తువులు విక్రయం

Sale of goods needed by the public at Mepma Bazaar

Sale of goods needed by the public at Mepma Bazaar

– క్రిష్ణవేణి

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని సంతగేటులో గల మున్సిపల్‌ భవన సముదాయంలో మెప్మా బజారును స్వయం సహాయ మహిళా సంఘాలచే 21 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సోమవారం మెప్మా బజారును మెప్మా జిల్లా అధికారి క్రిష్ణవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మున్సిపాలిటిలో మహిళ సంఘాల ప్రతినిధి సుజాత ఆధ్వర్యంలో గుడ్డ, జనపనార బ్యాగులను , క్యాండిల్స్ను ఏర్పాటు చేసి, ప్రజలకు విక్రయించడం చేపడుతామన్నారు. అలాగే మెప్మా బజారులో ఆహారపదార్థాలను విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించారు. మెప్మాబజారులో అన్ని రకాల వలను తయారు చేయించి, ప్రజలకు విక్రయించేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. మున్సిపాలిటిలో ప్లాస్టిక్‌ ను పూర్తి స్థాయిలో నిషేధించడం అదృష్టమన్నారు. మున్సిపాలిటిలోని ప్రజలందరు పాల్గొని మెప్మాబజారును అభివృద్ధి చేయలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా టౌన్‌మేనేజర్‌ రవి, సీవోలు మయూరి, జయంతి, మహిళా సంఘాల ప్రతినిధులు జానకి, గీత, వాణి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.

మాట వినలేదని కన్నకూతురుపై గంజిపోసిన తల్లి

Tags; Sale of goods needed by the public at Mepma Bazaar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *