Natyam ad

పుంగనూరులో అంజుమన్‌ కమిటి నూతన ప్రతినిధులుగా సలీం, ఇబ్రహిం

పుంగనూరు ముచ్చట్లు:

అంజుమన్‌ కమిటి ఎన్నికలు హ్గరాహ్గరీగా మంగళవారం జరిగాయి. ఎన్నికల్లో అంజుమన్‌ కవిటటి అధ్యక్షుడుగా ఎంఎస్‌.సలీంబాషా, కార్యదర్శిగా ఎస్‌.ఇబ్రహిం గెలుపొందారు. అలాగే కమిటి ఉపాధ్యక్షులుగా జాఫర్‌, ఇస్మయిల్‌, జాయింట్‌ సెక్రటరీ ఆరీపుల్లా, కోశాధికారిగా జబీర్‌ లు ఎన్నికైయ్యారు. కాగా 72 ఓట్లు గల అంజుమన్‌ కమిటిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంఎస్‌.సలీంబాషాకు 43 ఓట్లు లభించింది. సలీంబాషా గెలుపొందడంతో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా , ముతవల్లి అజీజ్‌సాబ్‌ , అంజుమన్‌ కమిటి నూతనంగా ఎన్నికైన వారిని శాలువకప్పి సన్మానించారు. అలాగే పలువురు ముస్లింలు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. సలీంబాషా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలను రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, మైనార్టీలకు అండగా ఉంటామని తెలిపారు.

 

Post Midle

Tags:Salim and Ibrahim are the new representatives of the Anjuman Committee in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.