దబాంగ్ 3 లో సల్మాన్

Salman in Dabangg 3

Salman in Dabangg 3

Date:21/07/2018
ముంబై ముచ్చట్లు:
రేస్ 3’ సినిమా తర్వాత కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భరత్’. ఆలీ జాఫర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ సరసన ప్రియాంక చోప్రా, దిశా పటాని హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అవేంటంటే.. ఈ సినిమా 1960 బ్యాక్‌డ్రాప్ నుండి ఇప్పటి వరకు జరిగే ఓ కథాంశంతో తెరకెక్కనుంది. ఇందులో సల్మాన్ ఖాన్ స్టంట్‌మేన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా కూడా చేయబోతున్నాడు సల్మాన్‌ఖాన్.
దబాంగ్ 3 లో సల్మాన్ https://www.telugumuchatlu.com/salman-in-dabangg-3/
Tags:Salman in Dabangg 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *