ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేస్తున్న జగనన్నకు వందనం

Salutations to Jagannanna who is running the election manifesto

Salutations to Jagannanna who is running the election manifesto

Date:06/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల సమయంలో పాదయాత్రలో నేరుగా చూసి…విన్న సమస్యలను గుర్తించి వాటిని ఎన్నికల మ్యానిఫెస్టోగా తయారు చేసి ప్రభుత్వం రాగానే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని వర్గాల నుంచి అభినందనాలు లభిస్తోంది. వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు గడుస్తున్న సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఆర్టీసి విలీనం చారిత్రత్మకమే ….

ఏ ప్రభుత్వము చేయలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వంద రోజుల్లోనే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని రికార్డు సృష్టించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి లక్షలాది కుటుంబాలకు జగన్‌మోహన్‌రెడ్డి ఆరాద్య దైవంగా మిగిలారు. ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసిన జగన్‌కు జోహార్లు….

– జయరామిరెడ్డి , జిల్లా అధ్యక్షుడు , వైఎస్సార్‌ మజ్ధూర్‌ ఆర్టీసి , పుంగనూరు

ఆటో డ్రైవర్లకు వరం….

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా డ్రైవర్లు ఒకొక్కరికి రూ.10 వేలు ప్రకటించడం హర్షనీయం. వంద రోజులలో ముఖ్యమంత్రి తాను స్వయం చూసి..విన్న సమస్యలను పరిష్కరించడంతో మాలాంటి వారికి బరోస లబించింది. ఇలాంటి ముఖ్యమంత్రి చిరకాలం ఉండాలని కోరుతున్నాం.

– నాగరాజు, ఆటో డ్రైవర్‌, పుంగనూరు.

ఈ ప్రభుత్వం మైనార్టీలది….

వైఎస్సార్సీపి ప్రభుత్వంలో, పార్టీలో ముస్లిం మైనార్టీలకు అగ్రస్థానం కల్పించారు. అందుచేత ఈ ప్రభుత్వం మైనార్టీలదని సగర్వంగా వెల్లడిస్తాం. మైనార్టీలకు రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్‌ కల్పించారు. అలాగే ముఖ్యంగా మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి రాష్ట్ర చరిత్రలో మైనార్టీల పాలనకు తెరతీసిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేం.

– ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు , పుంగనూరు

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ ….

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీల నివాస గృహాలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించడం హర్షనీయం. అలాగే 200 యూనిట్ల వినియోగానికి పెంచిన ఘనత వైఎస్సార్సీపి ప్రభుత్వానికి దక్కింది. ఎస్సీ, ఎస్టీలు పడుతున్న కష్టాలను చూసిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్‌ ప్రకటించడం మరువలేనిది.

– శంకరప్ప, రాష్ట్ర దళితసంక్షేమ సంఘ అధ్యక్షుడు, పుంగనూరు.

శుక్రవారం మారెమ్మకు రాహుకాల పూజలు

Tags: Salutations to Jagannanna who is running the election manifesto

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *