రాత్రి అంత సెల్యూట్ చేశాసూసైడ్ చేసుకోవాలనుకున్నా
సూర్యాపేట ముచ్చట్లు:
సినీయర్ విద్యార్దులకు రాత్రి అంత సెల్యూట్ చేశా..సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ర్యాగింగ్ బాధితుడు, సూర్యాపేట మెడికల్ కళాశాల, ప్రథమ సంవత్సరం విద్యార్ది సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. శనివారం రాత్రి సీనియర్స్ నన్ను 4 గంటలు గదిలో బంధించి మద్యం, పొగ తాగుతూ పిడిగుద్దులు గుద్దారు. వీడియోలు తీసి ట్రిమ్మతో గుండు గీసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు, సిస్టర్స్ బయోడేటా వందసార్లు చెప్పించారు.ప్రతీ ఒక్కరికీ పేరు పేరున సర్ అని పిలుస్తూ సెల్యూట్ చేశా.దీంతో శనివారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవాలనిపించిందని అన్నాడు. హాస్టల్ లో గత 10 రోజు ల క్రితం ప్రథమ సంవత్సరం విద్యార్థిని కొడితే కన్నుల కింద చర్మం పగిలి పోయింది. ఈ విషయాన్ని యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోలేదు. నెల రోజులుగా హాస్టల్ లో ర్యాగింగ్ చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. పోలీసు లకు ఫిర్యాదు చేసి రెండ్రోజులైనా న్యాయం జరగలేదు. ఇంటరాక్షన్ పేరుతో రాగింగ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనా లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏ విద్యార్థి కూడా ర్యాగింగ్ వల్ల భయపడకుండా చేయాలని కోరుతున్నాని అన్నాడు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Salute so much at night if you want to commit suicide