జనగణమనకు భక్తితో వందనం

The people of the city paid homage to the national anthem of the national anthem which was

The people of the city paid homage to the national anthem of the national anthem which was

– పుంగనూరులో ప్రారంభమైన జనగణమన

Date:16/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పుంగనూరులో ప్రారంభించిన జనగణమన జాతీయ గీతానికి పట్టణ ప్రజలు భక్తితో వందనం చేశారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు, పోలీసులు, విద్యార్థులు, ప్రజలు జనగణమన కమిటి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

గోకుల్‌ సర్కిల్‌, ఇందిరా సర్కిల్‌లో 7:59 గంటలకు దారం కట్టి రోడ్డుపై నిలబడ్డారు. 8 గంటల సమయంలో పోలీస్‌ సైరన్‌తో జనగణమన గీతం ప్రారంభమైంది. ఆర్టీసి బస్సులు, ప్రైవేటు వాహనాలు, పట్టణ ప్రజలు 52 సెంకడ్ల పాటు రోడ్డుపై ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన పూర్తికాగానే గౌరవ వందనం చేశారు.

 

ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌ ఎదుట పోలీసులు రోడ్డుపైకి వచ్చి, గౌరవ వందనం చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు ఇలాగే ముందుకు రావాలని కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌, వెంకటాచలపతిశెట్టి, భానుప్రకాష్‌, గోపాలక్రిష్ణ, మురళి, కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, కుమార్‌రాజు, శ్రావణ్‌కుమార్‌తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు గిరి, ఇంతియాజ్‌, కుమార్‌, నాగరాజ కోరారు.

పోటెత్తున్న గోదావరి బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల వాసులు

 

Tags: Salvation by devotion to democracy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *